ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 30 లక్షల కోట్ల శాశ్వత నష్టం ? కరోనా ఎఫెక్ట్

ABN, First Publish Date - 2020-09-12T01:15:10+05:30

ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి రేటును రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్ రేటింగ్స్’ సవరించింది. గతంలో 5 శాతం క్షీణించవచ్చునని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి రేటును రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్ రేటింగ్స్’  సవరించింది. గతంలో 5 శాతం క్షీణించవచ్చునని తెలిపిన క్రిసిల్... 9 శాతం మేర ప్రతికూలత నమోదు కావొచ్చునని తాజాగా అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపధ్యంలో... కేసుల సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉండటం, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలను ప్రభుత్వం తగినంతగా చేపట్టకపోవడం వంటి వివిధ కారణాలను క్రిసిల్ చూపించింది. అంతకుముందు మే నెలలో మైనస్ 5 శాతం అంచనా వేయగా, తొలి క్వార్టర్‌లో 23.9 శాతం ప్రతికూలత నేపథ్యంలో సవరణ జరిగింది.


రుణ వ్యవస్థీకరణ స్కీం...

దెబ్బతిన్న రంగాలకు పునర్వ్యవస్థీకరణ ఊతమిస్తుందని క్రిసిల్ అభిప్రాయపడింది. ఆటో డీలర్‌షిప్పులు, రత్నాలు, ఆభరణాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, పర్యాటక రంగం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు కొంత ఊరటనిస్తుందని తెలిపింది. పలు రంగాలు కరోనా పూర్వస్థితికి రావడానికి పునర్వ్యవస్థీకరణ ఉపయోగపడుతుందని వెల్లడించింది. అయితే రుణ పునర్వ్యవస్థీకరణకు ప్రతి మూడు కంపెనీల్లో ఒకటి మాత్రమే అర్హత సాధిస్తుందని తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థపై కరోనామహమ్మారి ఒక శాశ్వత మచ్చను మిగిల్చనుందని తెలిపింది.


రూ.30 లక్షల కోట్ల శాశ్వత నష్టం...

ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రభుత్వం మరింతగా ఖర్చు చేయాల్సి ఉందని, అయితే అలా జరగడం లేదని క్రిసిల్ అభిప్రాయపడింది. తగిన ద్రవ్య పరిస్థితులు లేవని తెలిపింది. అక్టోబర్ నాటికి కరోనా కేసులు పెరుగుదల ఆగిపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి జీడీపీ వృద్ధి రేటు కొంత సానుకూలంగా ఉండే అవకాశముంటుందని వెల్లడించింది. ఏమైనప్పటికీ... బారత ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ఓ శాశ్వత మచ్చను మిగిల్చిందని పేర్కొంది. స్వల్పకాలికంగా చూస్తే జీడీపీకి 13 శాతం శాశ్వత నష్టాన్ని తెచ్చి పెట్టే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ విలువ...రూ. 30 లక్షల కోట్ల వరకు ఉంటుందని వెల్లడించింది. 

Updated Date - 2020-09-12T01:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising