ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేక్ తయారీ రంగంలోకి క్యాడ్‌బరీ మాతృ సంస్థ మోండలేజ్ ఇండియా

ABN, First Publish Date - 2020-07-01T04:22:37+05:30

క్యాడ్ బరీ డైరీ మిల్క్ చాకోలేట్, క్యాడ్ బరీ ఓరియో, క్యాడ్ బరీ బోర్నవీటా వంటి ఎన్నో రుచికరమైన పదార్థాలను అందిస్తున్న సంస్థ మొండలైజ్ ఇండియా. ఇప్పుడు ఈ సంస్థ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాకోలేట్, క్యాడ్‌బరీ ఓరియో, క్యాడ్‌బరీ బోర్నవీటా వంటి ఎన్నో రుచికరమైన పదార్థాలను అందిస్తున్న సంస్థ మోండలేజ్ ఇండియా. ఇప్పుడు ఈ సంస్థ కేక్ తయారీ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. క్యాడ్‌బరీ చాకోబేక్స్-చాకో లేయర్డ్ కేక్స్ పేరుతో ఓ కొత్త ప్రొడక్ట్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మోండలేజ్ ఇండియా ప్రెసిడెంట్ దీపక్ అయ్యర్ మాట్లాడుతూ, మా సంస్థ ఉత్పత్తులకు దగ్గరగా ఉన్న ప్రొడక్ట్‌లను కూడా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇన్నాళ్లూ ఎంతో రుచికరమైన బిస్కెట్లు, చాకోలేట్లు ప్రజలకు అందించామని, ఇప్పుడు అంతకంటే రుచికరమైన చాకోకేక్‌లను అందించనున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో సంస్థకు ఎంతగానో సహకరిస్తున్న సిబ్బందికి కృతఙ్ఞతలు చెప్పారు. 


ఇదిలా ఉంటే ఈ క్యాడ్‌బరీ చాకోకేక్స్ ప్రోడక్ట్ మోండలేజ్ సంస్థనుంచి వస్తున్న బేకరీ ఐటమ్‌లలో రెండోది. ఇప్పటికే ఈ సంస్థ క్యాడ్‌బరీ చాకో ఫిల్డ్ కుకీస్ పేరుతో ఓ బేకరీ ప్రొడక్ట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. దానికి మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో కేక్స్‌పై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే చాకోకేక్స్‌ను పరిచయం చేసింది. ఈ చాకోకేక్స్ వచ్చే నెల నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - 2020-07-01T04:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising