ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎస్‌ఈతో తెలంగాణ ఒప్పందం

ABN, First Publish Date - 2020-10-20T05:36:17+05:30

బీఎస్‌ఈ (బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌) తో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య విభాగానికి చెందిన గ్లోబల్‌లింకర్‌ పోర్టల్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందానికి అనుగుణంగా తెలంగాణలోని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బీఎస్‌ఈ (బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌) తో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య విభాగానికి చెందిన గ్లోబల్‌లింకర్‌ పోర్టల్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందానికి అనుగుణంగా తెలంగాణలోని సూక్ష్మ, చిన్న మధ్య స్థాయి సంస్థ (ఎంఎ్‌సఎంఈ)లకు లిస్టింగ్‌ ప్రయోజనాలపై బీఎ్‌సఈ అవగాహన కల్పిస్తుంది. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, క్రెడిబిలిటీని పెంచుకోవడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగించడానికి శిక్షణ ఇస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ పరిశ్రమల ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చిన్న, మధ్య స్థాయి సంస్థలు మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించడంలో బీఎ్‌సఈ మార్గదర్శనం చేయగలదని అన్నారు.


ఈ ఒప్పందం వల్ల వ్యాపార కార్యకలాపాల విస్తరణ, ఇతర సంస్థల కొనుగోలుకు అవసరమైన నిధులను మార్కెట్‌ నుంచి తెలంగాణ ఎంఎ్‌సఎంఈలు సమీకరించగలవని బీఎ్‌సఈ ఎండీ, సీఈఓ ఆశిశ్‌ కుమార్‌ చౌహాన్‌ తెలిపారు. వ్యాపార వృద్ధికి, వ్యాపారాలను డిజిటలైజ్‌ చేసుకోవడానికి రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలకు అండగా ఉండేందుకు 2019 ప్రారంభంలో తెలంగాణ పరిశ్రమ విభాగం గ్లోబల్‌లింకర్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. 

Updated Date - 2020-10-20T05:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising