ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనాల్లో బైక్‌లదే జోరు!

ABN, First Publish Date - 2020-07-04T06:32:49+05:30

భారత వాహన పరిశ్రమలో మోటార్‌ సైకిల్‌ విభాగం మిగతా అన్నింటిలోకెల్లా మెరుగైన పనితీరు కనబర్చనుందని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంటోంది. కరోనా సంక్షోభం వినియోగదారుల ఆదాయంపై ప్రభావం చూపడమే ఇందు కు కారణమంటోంది. రాబడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత వాహన పరిశ్రమలో మోటార్‌ సైకిల్‌ విభాగం మిగతా అన్నింటిలోకెల్లా మెరుగైన పనితీరు కనబర్చనుందని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంటోంది. కరోనా సంక్షోభం వినియోగదారుల ఆదాయంపై ప్రభావం చూపడమే ఇందు కు కారణమంటోంది. రాబడి తగ్గిన నేపథ్యంలో వ్యక్తిగత వాహన కొనుగోలు చేయాలనుకునే వారిలో చాలామంది ద్విచక్ర వాహనంతో సరిపెట్టుకోవచ్చని అంటోంది. ఈ పరిణామం టూవీలర్‌ కంపెనీలకు కొంత కలిసిరానుందని ఫిచ్‌ పేర్కొంది. వర్ధమాన మార్కెట్లలో ద్విచక్ర వాహనాలకు గిరాకీ సమృద్ధిగా ఉండటంతో ఎగుమతుల రూపంలోనే అధిక ప్రయోజనం కలగనుందంటోంది. ఫిచ్‌ నివేదికలోని మరిన్ని అంశాలు..


  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత్‌లో మోటార్‌ సైకిళ్ల విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 23.7 శాతం తగ్గవచ్చు. టూవీలర్‌ కంపెనీల ఉత్పత్తి సైతం 16 శాతం తగ్గనుందని అంచనా. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో వాహన తయారీ ప్లాంట్లు, షోరూమ్‌లు మూతపడటం ఈసారి వాహన కంపెనీల విక్రయాలు, ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. 
  • కొవిడ్‌ సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి  వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో క్రమంగా తగ్గనుం ది. దాంతో వచ్చేసారి మోటార్‌ సైకిల్‌ విక్రయాలు 28.1 శాతం, ఉత్పత్తి 14 శాతం మేర పెరగవచ్చు.

Updated Date - 2020-07-04T06:32:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising