ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిస్కౌంట్‌ ఆరోగ్య పథకాలపై జర జాగ్రత్త: ఐఆర్‌డీఏఐ

ABN, First Publish Date - 2020-10-07T07:03:57+05:30

అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు విక్రయించే ఆరోగ్య బీమా పాలసీలపై అప్రమత్తంగా ఉండాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ హెచ్చరించింది. వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలపై డిస్కౌంట్‌ పేరుతో వీరు చెప్పే మాటలను ఏ మాత్రం నమ్మొద్దని ప్రజలను కోరింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు విక్రయించే ఆరోగ్య బీమా పాలసీలపై అప్రమత్తంగా ఉండాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ హెచ్చరించింది. వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలపై డిస్కౌంట్‌ పేరుతో వీరు చెప్పే మాటలను ఏ మాత్రం నమ్మొద్దని ప్రజలను కోరింది. ఐఆర్‌డీఏఐ వద్ద నమోదైన బీమా కంపెనీలు లేదా వారి అధీకృత ఏజెంట్ల నుంచి మాత్రమే ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తమ వద్ద నమోదైన బీమా కంపెనీల జాబితా తమ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపింది. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే, ఆయా బీమా కంపెనీలను సంప్రదించి నిర్దారించుకోవాలని కోరింది. కొన్ని సంస్థలు, కొంత మంది వ్యక్తులు అనధికారికంగా వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలపై డిస్కౌంట్స్‌ పేరుతో పాలసీలు మార్కెట్‌ చేస్తున్నట్టు తెలియడంతో ఈ ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2020-10-07T07:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising