ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాభాల్లో ముగిసిన బెంచ్‌మార్క్ సూచీలు

ABN, First Publish Date - 2020-06-18T22:49:45+05:30

దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. బెంచ్‌మార్క్ సూచీలు గురువారం లాభాల్లో ముగిసాయి. హెవీ వెయిట్ షేర్లు ర్యాలీతో మార్కెట్‌కు కలిసొచ్చింది. వీక్లి ఇండెక్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఈరోజు ఎక్స్‌పైరీ కావడం వల్ల షార్ట్ కవరింగ్‌తో మార్కెట్ ర్యాలీ చేసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 768 పాయింట్లు ర్యాలీ చేసింది. నిఫ్టీ కూడా 10,111 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మొత్తంగా... సెన్సెక్స్ 700 పాయింట్ల లాభంతో 34,208 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో 10,092 పాయింట్ల వద్ద ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. బెంచ్‌మార్క్ సూచీలు గురువారం లాభాల్లో ముగిసాయి. హెవీ వెయిట్ షేర్ల ర్యాలీతో మార్కెట్‌కు కలిసొచ్చింది. వీక్లి ఇండెక్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఈరోజు ఎక్స్‌పైరీ కావడం వల్ల షార్ట్ కవరింగ్‌తో మార్కెట్ ర్యాలీ చేసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 768 పాయింట్లు ర్యాలీ చేసింది. నిఫ్టీ కూడా 10,111 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మొత్తంగా... సెన్సెక్స్ 700 పాయింట్ల లాభంతో 34,208 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో 10,092 పాయింట్ల వద్ద ముగిసింది.

* నిఫ్టీ 50 లో బజాజ్ ఫిన్‌సర్వ్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, వేదాంత షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ ఏకంగా 8 శాతం పరుగులు పెట్టింది.

* సీఎస్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టపోయాయి. టీసీఎస్ దాదాపు ఒక శాతం పడిపోయింది.

* నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఫార్మా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 3 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 2.5 శాతం, నిఫ్టీ మెటల్ 3 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.6 శాతం, నిఫ్టీ బ్యాంక్ 3.7 శాతం చొప్పున లాభపడ్డాయి.

Updated Date - 2020-06-18T22:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising