ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకులను ప్రయోగాత్మకంగా ప్రైవేటీకరించి చూడాలి : రఘురాం రాజన్

ABN, First Publish Date - 2020-11-03T21:48:39+05:30

ప్రభుత్వరంగ బ్యాంకులను ఒకేసారి ప్రైవేటీకరించకపోయినప్పటికీ, ప్రయోగాత్మకంగా ఒకటి, రెండింటిని ప్రైవేటీకరించి చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురాంరాజన్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకులను ఒకేసారి ప్రైవేటీకరించకపోయినప్పటికీ, ప్రయోగాత్మకంగా ఒకటి, రెండింటిని ప్రైవేటీకరించి చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురాంరాజన్ పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ తమల్ బందోపాధ్యాయ రచించిన 'పాండెమోనియం: ది గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజెడీ' త్వరలో విడుదల కానుంది. ఈ పుస్తకంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు రఘురాం రాజన్, వైవీ రెడ్డి, దువ్వూరి సుబ్బారావు, సీ రంగరాజన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 


నరేంద్రమోడీ వల్లే అవుతుంది... బ్యాంకులపై దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీలు అవసరానికి మించి పెట్టిన పెట్టుబడులు, ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడంలో బ్యాంకులు ప్రదర్శించిన అత్యుత్సాహం, సత్వర స్పందన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఎన్పీఏ సమస్య పెరగడానికి మూల కారణాలని రఘురాం రాజన్ పేర్కొన్నారు. దేశీయ బ్యాంకుల ఎన్పీఏలు ఏ దేశంలోనూ లేనంత భారీస్థాయికి పెరిగాయన్నారు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు బ్యాంకుల నిరర్థక ఆస్తులతో ముప్పు పొంచి ఉందన్నారు. 

Updated Date - 2020-11-03T21:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising