ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బజాజ్ ఆటో యూనిట్‌లో 250 మందికి కరోనా.. వలూజ్ యూనిట్‌ను మూసేయాలని డిమాండ్!

ABN, First Publish Date - 2020-07-05T02:55:49+05:30

మహారాష్ట్రలోని వలూజ్‌లో ఉన్న బజాజ్ ఆటో యూనిట్‌లో 250 మంది ఉద్యోగులు కరోనా బారినపడడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలోని వలూజ్‌లో ఉన్న బజాజ్ ఆటో యూనిట్‌లో 250 మంది ఉద్యోగులు కరోనా బారినపడడంతో ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేయాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులున్న పశ్చిమ మహారాష్ట్రలో ఈ యూనిట్ ఉండడం గమనార్హం. మరోవైపు, విధులకు హాజరు కాని వారికి డబ్బులు చెల్లించబోమని ఉద్యోగులకు రాసిన లేఖలో కంపెనీ పేర్కొంది. కార్మికులు విధులకు రావాలంటే భయపడుతున్నారని, కొందరు వస్తున్నా, మరికొందరు సెలవు తీసుకుంటున్నట్టు బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెంగాడె బాజీరావు తెలిపారు.


మొత్తం 8 వేల మంది పనిచేస్తున్న ఈ యూనిట్‌లో 140 మంది కరోనా బారినపడినట్టు జూన్ 26న కంపెనీ పేర్కొంది. అయితే, పని ఆపేది లేదని, ‘వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలని’ కంపెనీ కోరుకుంటోందని పేర్కొంది. కాగా, కంపెనీలో కరోనా బారినపడిన వారి సంఖ్య 250కి పైనేనని ఔరంగాబాద్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. కంపెనీని 10-15 రోజులపాటు తాత్కాలికంగా మూసివేయాలని కోరుతున్నట్టు బాజీరావు తెలిపారు. కరోనా వైరస్‌ చైన్‌ను తెంచాలంటే మూయక తప్పదని అన్నారు.    

Updated Date - 2020-07-05T02:55:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising