ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరబిందో లాభం రూ.781 కోట్లు

ABN, First Publish Date - 2020-08-13T05:58:45+05:30

హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.780.68 కోట్లకు చేరుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఒక్కో షేరుపై రూ.1.25 మధ్యంతర డివిడెండ్‌  


న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.780.68 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.635.68 కోట్ల లాభంతో పోలిస్తే 22.81 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఈ జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో అరబిందో కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ.5,924.78 కోట్లకు పెరిగింది.


సవాళ్ల సమయంలోనూ ఆరోగ్యకరమైన పనితీరుతో ఈ ఆర్థిక సంవత్సరానికి నాంది పలికామని అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌ గోవిందరాజన్‌ అన్నారు. ఈ జూన్‌ త్రైమాసికంలో అమెరికన్‌ ఫార్ములేషన్‌ రాబడి రూ.3,107.1 కోట్లకు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన 15.6 శాతం వృద్ధి చెందింది. అంతేకాదు, కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయంలో దీనిదే 52.4 శాతం వాటా. ఈ ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను వాటాదారులకు రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కోషేరుకు రూ.1.25 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనున్నట్లు అరబిందో ఫార్మా ప్రకటించింది. 


Updated Date - 2020-08-13T05:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising