ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో కొత్తగా రెండు నిల్వ కేంద్రాలను విస్తరిస్తున్న అమెజాన్‌!

ABN, First Publish Date - 2020-09-16T01:59:53+05:30

పండుగ సీజన్‌ నేపథ్యంలో అమెజాన్ ఇండియా రాష్ట్రంలో సరఫరా మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం నగరంలో 2 కొత్త సరఫరా కేంద్రాలు(ఫుల్ ఫిల్ సెంటర్స్)ను ప్రారంభింస్తున్నట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పండుగ సీజన్‌ నేపథ్యంలో అమెజాన్ ఇండియా రాష్ట్రంలో సరఫరా మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం నగరంలో 2 కొత్త సరఫరా కేంద్రాలు(ఫుల్ ఫిల్ సెంటర్స్)ను ప్రారంభింస్తున్నట్లు తెలిపింది. ఈ విస్తరణ ద్వారా అమ్మకందారులు తమ కస్టమర్లకు పండుగ సీజన్‌కంటే ముందుగానే వారి ఆర్డర్లను డెలివరీ చేయగలగుతారని పేర్కొంది. కొత్త కేంద్రాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలో ఇకనుంచి 4 అమెజాన్‌ సరఫరా కేంద్రాలు పనిచేయనున్నాయి. ఈ కేంద్రాలలో 4.5 మిలియన్ క్యూబిక్ అడుగుల కంటే ఎక్కువ స్టోరేజీ సామర్థ్యం ఉంది. అంతేకాకుండా తెలంగాణలోని 23,000 మందికి పైగా అమ్మకందారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే తెలంగాణలో లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని అందించడానికి అమెజాన్ ఇండియా కార్యాచరణ రూపొందిస్తోంది.


ఇదిలా ఉంటే ఈ సరఫరా కేంద్రాల(ఫుల్ ఫిల్ సెంటర్స్) ద్వారా ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, టీవీలతో కూడిన పెద్ద ఉపకరణాల విభాగంలో మొత్తం ఫర్నిచర్ పరిధిని కలిగి ఉండి దాదాపు 1.2 లక్షల ఉత్పత్తులను నిల్వ చేయనుంది. తెలంగాణలోని ఇతర సరఫరా కేంద్రాల్లో స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ అండ్ కన్స్యూమబుల్స్ కేటగిరీలోని ఉత్పత్తుల కోసం వినియోగించనుంది.

Updated Date - 2020-09-16T01:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising