ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెజాన్ గుడ్‌న్యూస్.. త్వరలో 50 వేల తాత్కాలిక ఉద్యోగాలు

ABN, First Publish Date - 2020-05-23T03:18:42+05:30

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పలు కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పలు కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తుండగా, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం అందుకు భిన్నమైన వార్త చెప్పింది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుంటామని వెల్లడించింది.  లాక్‌డౌన్ కారణంగా షాపింగ్ మాల్స్, దుకాణాలు దాదాపు రెండు నెలలపాటు మూతపడ్డాయి. ఫలితంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌కు డిమాండ్ ఏర్పడింది. మొదట్లో కొన్ని వస్తువులకు మాత్రమే అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాదాపు పూర్తి అనుమతులు ఇచ్చింది.  తాజా సడలింపులతో ఈ-కామర్స్ సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారం పుంజుకుంటుందని భావిస్తున్న అమెజాన్ డెలివరీ నెట్‌వర్క్, అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల్లో తాత్కాలిక ప్రాతిపదికన 50 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించినట్టు అమెజాన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ సక్సేనా తెలిపారు. 

Updated Date - 2020-05-23T03:18:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising