ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల రోజుల పండుగకు తెరతీసిన అమెజాన్

ABN, First Publish Date - 2020-10-08T01:42:47+05:30

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మరో భారీ సేల్‌కు తెరలేపేందుకు సిద్ధమైంది. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి ‘గ్రేట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మరో భారీ సేల్‌కు తెరలేపేందుకు సిద్ధమైంది. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020’ సేల్‌ను ప్రారంభించనుంది. అదే సమయంలో మరో దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను ప్రారంభించనుంది. అయితే, ఇది ఆరు రోజులు మాత్రమే కొనసాగనుండగా, అమెజాన్ మాత్రం ఏకంగా నెల రోజులపాటు పాటు ఈ సేల్ నిర్వహించనుండడం విశేషం. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో గతంలోనూ పలు సేల్స్ నిర్వహించినప్పటికీ అప్పుడు వారం రోజులకే పరిమితం చేసింది.  


వినియోగదారులకు అవసరమైన అన్నింటిని అందించడమే ఈ నెల రోజుల సేల్ లక్ష్యమని అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు మనీశ్ తివారీ తెలిపారు. సేల్ 17న ప్రారంభం కానుండగా, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం ముందు రోజే అంటే అక్టోబరు 16నే అందుబాటులోకి రానుంది. ఈ ఫెస్టివ్ సీజన్‌లో స్థానిక దుకాణాల ద్వారా పలు రకాల స్థానిక ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, మొత్తం 900 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తోంది. తద్వారా అమెజాన్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. 


అమెజాన్‌ ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లిష్ భాషలకే పరిమితం కాగా, గత నెలలో కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు భాషలను చేర్చింది. కొత్త వినియోగదారులకు ఆకర్షించడంలో భాషలు కీలకంగా మారుతాయని అమెజాన్ భావిస్తోంది. కాగా, అమెజాన్ ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషలు అందుబాటులో ఉన్నాయి. 

Updated Date - 2020-10-08T01:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising