ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంపెనీల రాబడికి 25శాతం గండి

ABN, First Publish Date - 2020-05-22T06:54:54+05:30

లాక్‌డౌన్‌ సమయంలో ఆదాయం 25 శాతానికి పైగా తగ్గిందని వివిధ కంపెనీల ఉన్నత స్థాయి మేనేజర్లు తెలిపారు. అంతేకాదు, వ్యాపారం మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఏడాదికి పైగా పట్టొచ్చట. ఆన్‌లైన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రొవైడర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌ సమయంలో ఆదాయం 25 శాతానికి పైగా తగ్గిందని వివిధ కంపెనీల ఉన్నత స్థాయి మేనేజర్లు తెలిపారు. అంతేకాదు, వ్యాపారం మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఏడాదికి పైగా పట్టొచ్చట. ఆన్‌లైన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రొవైడర్‌ ‘స్ర్కిప్‌బాక్స్‌’ తాజా అధ్యయన నివేదిక ‘కొవిడ్‌-19 అండ్‌ యువర్‌ వెల్త్‌’ ఈ విషయాల్ని వెల్లడించింది. కంపెనీల ఆదాయంపై లాక్‌డౌన్‌ ప్రభావం, ఉద్యోగాల తొలగింపులు వంటి అంశాలపై సంస్థ అధ్యయనం జరిపింది. ఈనెల 1-15 తేదీల్లో దాదాపు 1,200 మంది కార్పొరేట్‌, ఎస్‌ఎంఈ, స్టార్టప్‌ ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించింది. 


  1. రాబడి 25 శాతంపైగా పడిపోయిందని సర్వేలో పాల్గొన్న 67 శాతం మంది తెలిపారు. 
  2. వచ్చే ఏడాదికిగానీ వ్యాపారం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోలేకపోవచ్చని అందరి అభిప్రాయం. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఏడాదికి పైగా సమయం పట్టొచ్చని 22 శాతం మంది అంచనా. 
  3. రాబడి తగ్గుదలతోపాటు ఉద్యోగాలకూ కోతపడింది. 25 శాతం లోపు ఉద్యోగాలకు కోతపడినట్లు 90 శాతం మంది వెల్లడించారు. మరో 10 శాతం మాత్రం 25 శాతానికి పైగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందన్నారు. ఎస్‌ఎంఈ విభాగంలో ఉద్యోగాలపై అధిక ప్రభావం పడింది. 
  4. ఫ్రీలాన్సర్లపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమయంలో తమ రాబడి 25 శాతం పైగా తగ్గిందని సర్వేలో పాల్గొన్న 66 శాతం మంది తెలిపారు. మరో 35 శాతం మంది మాత్రం ఆదాయం పూర్తిగా కుంటుపడిందన్నారు.

Updated Date - 2020-05-22T06:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising