ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు బకాయిలు చెల్లించనున్న టెల్కోలు!

ABN, First Publish Date - 2020-02-17T07:01:20+05:30

ఏజీఆర్‌ బకాయిలపై టెలికాం కంపెనీలు (టెల్కోలు) దారికొస్తున్నాయి. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, టాటా టెలిసర్వీసెస్‌ సోమవారం కొంత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎంత చెల్లిస్తారనే దానిపై సస్పెన్స్‌

న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బకాయిలపై టెలికాం కంపెనీలు (టెల్కోలు) దారికొస్తున్నాయి. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌  ఐడియా, టాటా టెలిసర్వీసెస్‌ సోమవారం కొంత బకాయిలు చెల్లించే అవకాశం ఉందని సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం ఈ కంపెనీలు టెలికాం శాఖ(డాట్‌)కు ఏజీఆర్‌ కింద రూ.1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇందులో ఎంత మొత్తాన్ని ఈ కంపెనీలు సోమవారం చెల్లిస్తాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ నెల 20కల్లా ఏజీఆర్‌ బకాయిల కింద రూ.10,000 కోట్లు చెల్లించేందుకు ఎయిర్‌టెల్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆర్థిక కష్టాలు ఉన్నా తాము ఎంత చెల్లించాలనే విషయాన్ని లెక్కిస్తున్నట్టు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. ఈ నెల 14న సుప్రీం కోర్టు ఆదేశంతో ఈ గడువు ఇక ఎంత మాత్రం పొడిగించే అవకాశంలేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు పుట్టెడు ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలని కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ బకాయిలు చెల్లించి వచ్చే నెల 17న ఆయా కంపెనీల ఎండీలు, డైరెక్టర్లు కోర్టులో స్వయంగా హాజరు కావాలని సుప్రీం కోర్టు ఈ నెల 14న ఆదేశించింది. దీంతో ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో టెల్కోలకు పాలు పోవడం లేదు. 

Updated Date - 2020-02-17T07:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising