ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానయానానికి కరోనా కాటు

ABN, First Publish Date - 2020-03-11T06:34:31+05:30

భారత్‌లోకి ప్రవేశించిన రోజుల వ్యవధిలోనే పలు కీలక రంగాలపై పంజా విసిరిన కరోనా.. తాజాగా దేశీయ విమానరంగంపై కూడా ప్రభావం చూపిస్తోంది. కరోనా భయంతో చాలామంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశీయంగా 15 శాతం పడిపోయిన ఆక్యుపెన్సీ

భారీగా తగ్గిన టికెట్ల ధరలు


న్యూఢిల్లీ: భారత్‌లోకి ప్రవేశించిన రోజుల వ్యవధిలోనే పలు కీలక రంగాలపై పంజా విసిరిన కరోనా.. తాజాగా దేశీయ విమానరంగంపై కూడా ప్రభావం చూపిస్తోంది. కరోనా భయంతో చాలామంది ప్రయాణాల్ని రద్దు చేసుకుంటుం డటంతో దేశీయంగా ఎయిర్‌లైన్స్‌ ఆక్యుపెన్సీ రేటు 15ు మేర పడిపోయింది. అసలే అంతర్జాతీయంగా భారత్‌కు రాకపోకలపై పలు దేశాలు నిషేధాన్ని విధించడంతో ఇరకాటంలో పడిన దేశీయ విమానయాన సంస్థలు తాజా పరిణామాలతో మరిం త భయానికి లోనవుతున్నాయి. ఆదాయానికి కీలక మార్గాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు మధ్య నడుస్తున్న విమానాల్లోనే అత్యధికంగా ఆక్యుపెన్సీ తగ్గుదల కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా కరోనా విజృంభిస్తున్నా ఆ ప్రభావం నుంచి భారత విమానయాన సంస్థల్ని దేశీయ మార్కెట్‌ కాపాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అందులో కూడా డిమాండ్‌ తగ్గుముఖం పడుతుండటంతో ఎయిర్‌లైన్స్‌ సంస్థలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. మరోవైపు చమురు ధరలు కూడా తగ్గడంతో టికెట్‌ ధరల్ని ఎయిర్‌లైన్స్‌ భారీగా తగ్గించాయి. కొన్ని సంస్థలైతే రద్దు చార్జీలను సైతం తొలగించడం గమనార్హం. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే  విమానాల సంఖ్యను సగానికి కుదించడం తప్ప మరో దారిలేదని ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు చెబుతున్నారు. చైనా, ఆగ్నేయాసియా దేశాలకు భారత్‌ నుంచి విమానాల సంఖ్య కాస్త తక్కువగానే ఉండటంతో.. కరోనా తమను పెద్దగా ఇబ్బంది పెట్టదని భావిస్తూ వచ్చామని, అయితే.. భారత్‌కు రాకపోకలపై పలు దేశాలు ఆంక్షలు విధించడం ఇబ్బందిగా పరిణమిస్తోందని వివరించారు. ఎయిర్‌లైన్‌ సంస్థకయ్యే మొత్తం ఖర్చు లో 30 శాతం ఇంధనం పైనే ఉంటుంది. 


ఈ నేపథ్యంలో ముడి చమురు పీపా ధర 35 డాలర్ల కంటే దిగువకు పడిపోవడం ఎయిర్‌లైన్స్‌కు మేలుచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో లాభం కావాలంటే.. కొన్ని రూట్లలో సర్వీసుల్ని నిలిపివేసి ఖర్చును తగ్గించుకోవడమే శ్రేయస్కరమని దేశీయ ఎయిర్‌లైన్స్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కరోనా విలయం మధ్య ముడి చమురు ధరలు తగ్గడం ఒక్కటే విమానయాన సంస్థలకు లభించిన చిన్న ఊరట.

Updated Date - 2020-03-11T06:34:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising