ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివాలా చట్టంతో గట్టెక్కిన కంపెనీలే అధికం

ABN, First Publish Date - 2020-09-20T06:12:08+05:30

దివాలా చట్టం అస్త్రంగా మూసివేయించిన కంపెనీల కన్నా కాపాడిన కంపెనీలే అధికమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వీలైనంత వరకు వ్యాపారాలు కొనసాగించుకునే లా చూడాలన్నదే లక్ష్యమని వివరించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దివాలా చట్టం అస్త్రంగా మూసివేయించిన కంపెనీల కన్నా కాపాడిన కంపెనీలే అధికమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వీలైనంత వరకు వ్యాపారాలు కొనసాగించుకునే లా చూడాలన్నదే లక్ష్యమని వివరించారు. వాస్తవానికి 258 కంపెనీలు దివాలా తీయకుండా ఈ చట్టం కాపాడిందని, 965 సంస్థలు మాత్రం దివాలాకు వెళ్లాయని ఆమె చెప్పారు. కాపాడిన 258 కంపెనీల ఆస్తుల విలువ రూ.96 వేల కోట్లు కాగా దివాలాకు వెళ్లిన 965 కంపెనీల ఆస్తుల విలువ రూ.38 వేల కోట్లని వివరిస్తూ దివాలాకు వెళ్లిన కంపెనీల కన్నా దివాలాకు వెళ్లకుండా కాపాడిన కంపెనీల ఆస్తుల విలువ అధికమని ఆమె వివరించారు.


శనివారం రాజ్యసభ మూజువాణి ఓటుతో దివాలా చట్టం (రెండవ సవరణ) బిల్లు 2020ని ఆమోదించింది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయి లాక్‌డౌన్‌ ప్రకటించిన మార్చి 25 నుంచి 6 నెలల పాటు ఏ కంపెనీ పైనా తాజాగా దివాలా చర్యలు చేపట్టకుండా ఉండేందుకుజారీ చేసిన ఆర్డినెన్సు స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 

Updated Date - 2020-09-20T06:12:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising