ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాదికి 41% వృద్ధి

ABN, First Publish Date - 2020-07-03T06:42:02+05:30

గత మూడేళ్లలో హైదరాబాద్‌లో వేర్‌హౌసింగ్‌ గిరాకీ ఏడాదికి సగటున 41 శాతం చొప్పున పెరిగింది. దేశంలోని మొదటి ఎనిమిది నగరాల్లో గిడ్డంగుల అభివృద్ధికి అత్యధిక అవకాశం ఉన్నది హైదరాబాద్‌లోనేనని 2020కి భారత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత మూడేళ్లలో హైదరాబాద్‌లో వేర్‌హౌసింగ్‌ గిరాకీ ఏడాదికి సగటున 41 శాతం చొప్పున పెరిగింది. దేశంలోని మొదటి ఎనిమిది నగరాల్లో గిడ్డంగుల అభివృద్ధికి అత్యధిక అవకాశం ఉన్నది హైదరాబాద్‌లోనేనని 2020కి భారత వేర్‌హౌసింగ్‌ మార్కెట్‌పై ఇచ్చిన నివేదికలో నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. ప్రస్తుతం 1.3 కోట్ల చదరపు అడుగుల సదుపాయం కలిగిన గిడ్డంగులు ఉండగా.. దీన్ని 2.9 కోట్ల చదరపు అడుగుల వరకూ పెంచే అవకాశం ఉంది. దాదాపు 1,291 ఎకరాల భూమి గిడ్డంగుల నిర్మాణనికి కేటాయించడం వంటి సానుకూల అంశాలు ఇందుకు దోహదం చేయనున్నాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 34 లక్షల చదరపు అడుగుల గిడ్డంగి స్థలం లీజుకిచ్చారు. ఈ-కామర్స్‌, రిటైల్‌, ఎఫ్‌ఎంసీజీ, పరిశ్రమలు హైదరాబాద్‌లో వేర్‌హౌస్‌ రంగం విస్తరణకు దోహదం చేస్తున్నాయి. 2019-20లో లీజుకు తీసుకున్న స్థలంలో 50 శాతం ఈ పరిశ్రమలు తీసుకున్నవే కావటం విశేషం.

Updated Date - 2020-07-03T06:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising