ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2.6 లక్షల కోట్ల డాలర్లు

ABN, First Publish Date - 2020-08-22T07:20:05+05:30

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచంలో సంపన్నదేశాలు, వర్థమాన దేశాలు అనే తేడా లేకుండా అన్నిం టినీ తీవ్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిటన్‌పై కనీవినీ ఎరుగని రుణభారం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచంలో సంపన్నదేశాలు, వర్థమాన దేశాలు అనే తేడా లేకుండా అన్నిం టినీ తీవ్ర రుణభారంలోకి నెట్టేస్తోంది. తాజా సమాచారం ప్రకారం బ్రిటిష్‌ ప్రభుత్వ రుణభారం 2.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయిని దాటిపోయింది. బ్రిటిష్‌ చరిత్రలోనే ప్రభుత్వంపై  అతి పెద్ద రుణభారం ఇది.


కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా కుంగిపోయిన ఆర్థిక రంగానికి మద్దతు ఇవ్వడం కోసం చేసిన రుణాలే ఈ పరిణామానికి కారణమని జాతీయ గణాంకాల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జూలై నెలలో ప్రభుత్వం అదనంగా 2670 కోట్ల పౌండ్ల రుణాలు సమీకరించిందని, 1993లో గణాంకాల సేకరణ మొదలైన తర్వాత వరుసగా నాలుగో నెల ఇంత భారీ స్థాయిలో రుణసేకరణ జరగడం ఇదే ప్రథమమని పేర్కొంది. దీని ప్రభావం వల్ల దేశ రుణభారం ఆర్థిక ఉత్పాదకత విలువను దాటిపోయిందని కూడా స్పష్టం చేసింది.


వార్షిక జీడీపీలో బ్రిటిష్‌ ప్రభుత్వ రుణభారం  100.5 శాతానికి చేరిందని కూడా తెలిపింది. కరోనా కారణంగా తీవ్ర కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం భారీగా వేతన మద్దతు పథకాలు, ఇతర కార్యక్రమాలు ప్రకటించడం, పన్నుల్లో భారీ కోతలు విధించడం వంటి చర్యలు తీసుకుంది.


లక్షలాది ఉద్యోగాలు కాపాడడానికి, వ్యాపారాలకు జీవం పోయడానికి, ప్రజల జీవనోపాధికి సహాయపడడం కోసం ఈ మద్దతు చర్యలు చేపట్టి ఉండకపోతే పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోయి ఉండేదని ఆర్థికమంత్రి రిషి శునక్‌ అన్నారు. లాక్‌డౌన్ల నుంచి సడలింపులు ఇవ్వడంతో ఆర్థిక రంగంలో కొంత చలనం మొదలయిందని చెప్పారు. 


Updated Date - 2020-08-22T07:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising