ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మకానికి 20 పీఎ్‌సయూలు

ABN, First Publish Date - 2020-09-15T05:47:54+05:30

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎ్‌సయూ) అమ్మకాన్ని మరింత ఉధృతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా 20 సీపీఎ్‌సయూల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ హెచ్‌ఎ్‌ఫఎల్‌ కథ కంచికి : కేంద్ర మంత్రి ఠాకూర్‌


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎ్‌సయూ) అమ్మకాన్ని మరింత ఉధృతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా 20 సీపీఎ్‌సయూల అమ్మకాన్ని ‘వ్యూహాత్మక’ పెట్టుబడుల ఉపసంహరణ జాబితాలో చేర్చింది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్‌ చేసిన సిఫార్సులను ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.


ప్రస్తుతం ఈ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. పునరుద్ధరణకు ఏ మాత్రం అవకాశం లేని ఇంకో ఆరు సీపీఎ్‌సయూలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన హిందూస్థాన్‌ ఫ్లోరోకార్బన్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎ్‌ఫఎల్‌) కూడా ఉంది. మూసివేత ప్రమాదం ఎదుర్కొంటున్న ఆరు సీపీఎ్‌సయూల్లో కొన్ని న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నట్టు మంత్రి చెప్పారు. 


తగ్గిన ఎన్‌పీఏలు: పెద్ద కంపెనీలు, సర్వీసు రంగం నుంచి బ్యాంకులకు రావలసిన రుణ వసూళ్లు క్రమంగా మెరుగుపడుతున్నాయి. గత రెండేళ్లలో ఈ రెండు రంగాల్లో మొండి బకాయి (ఎన్‌పీఏ)ల భారం 31 శాతం తగ్గిందని ఠాకూర్‌ చెప్పారు.

2018 మార్చి నాటికి ఈ రెండు రంగాల్లో ఎన్‌పీఏల భారం రూ.6,35,971 కోట్లు ఉండేది. ఈ ఏడాది జూన్‌ నాటికి ఇది రూ.4,36,492 కోట్లకు తగ్గిందని మంత్రి చెప్పారు. కాగా పీఎ్‌సబీ ఈక్విటీల్లో విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎ్‌ఫపీఐ) వాటాను 49 శాతానికి పెంచే యోచనేది లేదని చెప్పారు.

Updated Date - 2020-09-15T05:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising