ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘‘జగన్‌ను చూసి కాదు.. వైఎస్ ఫొటో చూసి ఓటేశాం’’

ABN, First Publish Date - 2020-09-18T22:38:05+05:30

రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణపై జిల్లాలోని గోరంట్ల మండల వైసీపీ నాయకులు మండిపడ్డారు. అభివృద్ధి పనులకు మంత్రి సోదరుడు మల్లికార్జున్ అడ్డుపడుతున్నారంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణపై జిల్లాలోని గోరంట్ల మండల వైసీపీ నాయకులు మండిపడ్డారు. అభివృద్ధి పనులకు మంత్రి సోదరుడు మల్లికార్జున్ అడ్డుపడుతున్నారంటూ తాము చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని గోరంట్లకు చెందిన వైసీపీ నేత సింగిల్ విండో అధ్యక్షుడు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గంపల రమణ రెడ్డి అన్నారు. తమపై ఐదు కోట్ల రూపాయలకు మంత్రి సోదరుడు మల్లికార్జున దావా వేశారని.. గోరంట్లలో చేసిన వసూళ్లు సరిపోవడం లేదని, ఈ రూపంలో కూడా తమపై వసూళ్లకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. నోటీసును వెనక్కి తీసుకోకపోతే ధర్మవరంలోని మంత్రి ఇంటికి పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. తాము శంకర్ నారాయణను, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటు వేయలేదని, రాజశేఖర్ రెడ్డి ఫొటో చూసి మాత్రమే ఓట్లు వేశామన్నారు. దావా బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.

Updated Date - 2020-09-18T22:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising