ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లెటర్‌హెడ్‌ తెచ్చిన చిక్కు!

ABN, First Publish Date - 2020-07-14T08:06:47+05:30

సొంత ఎంపీని సాగనంపడానికి వైసీపీ జారీచేసిన షోకాజ్‌ నోటీసు వ్యవహారం అటు తిరిగీ.. ఇటు తిరిగీ ఢిల్లీ హైకోర్టుకు చేరడం వైసీపీ నాయకత్వానికి ఇరకాటంలో పడేసింది. నరసాపురం ఎంపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరున్న లెటర్‌హెడ్‌పై రఘురామరాజుకు విజయసాయి నోటీసు
  • ఆ పేరు గానీ, వైఎస్‌ బొమ్మ గానీ వాడొద్దని గతంలోనే ఈసీ నిర్దేశం
  • ఇదే విషయమై కమిషన్‌కు ఎంపీ
  • దానిపైనే అన్న వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ కోర్టుకు
  • కోర్టులో తేలేదాకా ‘అనర్హత’ చర్యలను.. లోక్‌సభ స్పీకర్‌ నిలిపివేసే అవకాశం?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సొంత ఎంపీని సాగనంపడానికి వైసీపీ జారీచేసిన షోకాజ్‌ నోటీసు వ్యవహారం అటు తిరిగీ.. ఇటు తిరిగీ ఢిల్లీ హైకోర్టుకు చేరడం వైసీపీ నాయకత్వానికి ఇరకాటంలో పడేసింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయడం మాత్రమేమోగానీ.. ఇప్పుడు పార్టీ గుర్తింపు రద్దుకు సంబంధించి నోటీసులు జారీకావడం విస్మయానికి గురిచేసింది. ఈ పరిస్థితిని ముఖ్య నేతలు అసలు ఊహించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రఘురామకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డిపై షో కాజ్‌ నోటీసు ఇస్తూ.. లెటర్‌హెడ్‌పై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అని పార్టీ పూర్తి పేరును ఉపయోగించకుండా సంక్షిప్తంగా వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని ఉపయోగించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వేరే పార్టీ ‘అన్న వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ’ని పోలిన పేరున్న లెటర్‌హెడ్‌పై షోకాజ్‌ ఇవ్వడం చట్టబద్ధం కాదని పేర్కొన్నా రు. ఆయా అంశాలపై స్వయంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌(ఈసీ)ను కలిసి చర్చించారు. కమిషన్‌ ఇంకా సమాధానమివ్వలేదు.


ఇవే సందేహాలు వ్యక్తంచేస్తూ సీఎం జగన్‌ కి లేఖ రాశారు. తదనంతరం సాయిరెడ్డి నేతృత్వంలోని పార్టీ ఎంపీ ల బృందం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి.. లోక్‌స భ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది. దీనిపై ఎంపీ ఏపీ హైకోర్టును ఆరఽశయించారు. ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’కి సంబంధించి తాను ఈసీకి అందజేసిన దరఖాస్తుకు తుది పరిష్కారం లభించేంతవరకూ తనకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసుపై ఆ పార్టీ గానీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానీ తదుపరి చర్యలేవీ చేపట్టకుండా నిలుపుదల చేయాలని ఆయన అభ్యర్థించారు. మ రోవైపు.. తమ పార్టీ పేరును పోలిన విధంగా వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్న సంక్షిప్త నామాన్ని గానీ, వైఎస్‌ బొమ్మను గానీ ఉపయోగించడానికి వీల్లేద ని గతంలోనే ఈసీ ఆదేశించిందని.. అయినా వాడుతోందని.. అందుచేత వైసీపీ గుర్తింపును రద్దు చే యాలని అన్న వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మహబూబ్‌ బాషా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు.


ఇప్పుడు ఈ లెటర్‌హెడ్‌ వ్యవహారాన్ని కోర్టులో సమర్థించుకోవలసిన బాధ్యత వైసీపీపై పడింది. ఈ నేపథ్యంలో ఇది తేలేవరకూ.. రఘురామరాజుపై అనర్హత వేటుకు సంబంధించిన తదుపరి చర్యలను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నిలిపివేసే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంటున్నాయి.


గుర్తింపు రద్దు పిటిషన్‌పై... వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసు

న్యూఢిల్లీ, జూలై 13(ఆంధ్రజ్యోతి): చట్టవిరుద్ధంగా తమ పే రు ఉపయోగిస్తున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ) గుర్తింపును రద్దు చేయాలని ‘అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ’ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు వైసీపీకి నోటీసు జారీచేసింది. 4 వారాల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది. అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మహబూబ్‌ బాషా దాఖలు చేసి న పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయంత్‌నాథ్‌.. వైసీపీతోపాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కి కూడా నోటీసులు జారీచేశారు. విచారణను సెప్టెంబరు 3కి వాయిదా వేశారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది విపిన్‌ నాయర్‌ వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ.. సంక్షిప్తంగా ‘వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ’ అని వాడుతోందని.. అది తమ పార్టీ పేరును పోలి ఉందని బాషా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-14T08:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising