ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెడు ఎంత దుర్మార్గమైనా అంతిమ విజయం మంచినే : జగన్

ABN, First Publish Date - 2020-10-25T15:34:14+05:30

లుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా అని సీఎం తెలిపారు. ఆదివారం నాడు దసరా పండుగ సందర్భంగా జగన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు అని జగన్ పేర్కొన్నారు.


గవర్నర్ విజ్ఞప్తి..

మరోవైపు.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి పండుగ ధర్మం ఆధిపత్యాన్ని సూచిస్తుందన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో చేతులు శుభ్రపరుచుకోవటం మాస్క్, భౌతిక దూరం పాటిస్తూ పండగను జరుపుకోవాలని ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేస్తూ రాజ్‌భవన్ నుంచి ప్రకటనను విడుదల చేశారు.

Updated Date - 2020-10-25T15:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising