ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాలో అర్ధాంతరంగా ఆగిన అభివృద్ధి పనులు

ABN, First Publish Date - 2020-08-02T21:23:51+05:30

కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి దశ మార్చేస్తానన్న ప్రభుత్వం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి దశ మార్చేస్తానన్న ప్రభుత్వం 14 నెలల కాలాన్ని 14 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ నిలిపివేయడమే కాకుండా కొత్తగా ఒక్క అభివృద్ధి పని కూడా జగన్ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లలేదు. కర్నూలు జిల్లాలో ఆగిన అభివృద్ధి పనులపై  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.


కర్నూలు జిల్లాలలో కరువును శాశ్వతంగా పాలద్రోలేందుకు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, రోడ్లు తదితర ముఖ్యమైన అభివృద్ధి పనులకు నిర్లక్ష్యపు గ్రహణం పట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని ప్రధానమైన అభివృద్ధి పనులు అటుకెక్కాయి. వెనుకబడిన సీమ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించి వందల కోట్ల రూపాయల నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఓర్వకల్లును పారిశ్రామిక హబ్‌గా మార్చాలని గత ప్రభుత్వం సంకల్పించింది. పలు ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చాయి. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు వెనకడుగు వేశాయి. తప్పనిసరిగా ఉన్న నిర్మాణం, ప్రారంభించిన కొన్ని కంపెనీలు వేగాన్ని తగ్గించాయి. ప్రముఖ కంపెనీల పనులే నత్తనడకను తలపిస్తుంటే  ఇక మధ్య, చిన్న తరహా పరిశ్రమల గురించి చెప్పుకోడానికి ఏముంది. కర్నూలు విమానాశ్రయం పనులు చివరి దశకు చేరినా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. 

Updated Date - 2020-08-02T21:23:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising