ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేన కార్యకర్తపై దాడి అమానుషం:పవన్ కళ్యాణ్

ABN, First Publish Date - 2020-05-27T21:48:48+05:30

జనసేన కార్యకర్తపై దాడి అమానుషం:పవన్ కళ్యాణ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. జనసేన కార్యకర్తపై  వైసీపీ వర్గానికి చెందినవారు విచక్షణారహితంగా దాడి అమానుషమని పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని మల్లాపల్లి గ్రామ‌వాసి, జనసేన కార్యకర్త మేకల ఈశ్వరయ్యపై దాడి వైసీపీ వర్గానికి చెందినవారు దాడి చేయడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తమ జెండా తప్ప జనసేన జెండా కనిపించకూడదు అనే నియంతృత్వ, ఫ్యాక్షన్ పోకడలతో చేసిన దాడి ఇది అని పవన్ అన్నారు. జనసేన కార్యక్రమాలు చేయకూడదు, జెండా కట్టకూడదు అని పుట్టపర్తి ఎమ్మెల్యే అనుచరులు హుకుం జారీ చేశారని, పార్టీపై అభిమానంతో ముందుకు వెళ్లిన ఈశ్వరయ్యను లక్ష్యంగా చేసుకున్నారని, అదే విధంగా గ్రామంలో బోరు వేసే విషయాన్ని సాకుగా తీసుకుని జనసేన కార్యకర్తపై దాడికి తెగబడ్డారని పవన్ అన్నారు. ఈ ఘటనకు కారకులైన అధికార పక్షం వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా పోలీసు యంత్రాంగంపై ఉందని పవన్ అన్నారు. కదిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరయ్యకు పార్టీ అండగా ఉంటుందని, జనసేన కార్యకర్తలపై దాడులకు తెగబడి, తప్పుడు కేసులు నమోదు చేసి బెదిరిస్తున్న ఘటనలు అన్ని జిల్లాల్లో చోటు చేసుకొంటున్నాయని పవన్ మండిపడ్డారు. వీటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి చట్టపరంగా ముందుకు వెళ్తామని పవన్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-27T21:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising