తూర్పు, గాజుల కాపు వర్గాన్ని ఓబీసీగా గుర్తించండి
ABN, First Publish Date - 2020-03-14T10:47:03+05:30
రాష్ట్రంలో ఎక్కడ జీవిస్తున్నా, స్థిరపడినా తూర్పు కాపు, గాజుల కాపు సామాజికవర్గాలను ఓబీసీలుగా గుర్తించాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు...
న్యూఢిల్లీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడ జీవిస్తున్నా, స్థిరపడినా తూర్పు కాపు, గాజుల కాపు సామాజికవర్గాలను ఓబీసీలుగా గుర్తించాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రాన్ని కోరారు. శుక్రవారం లోక్‌సభలో కేంద్ర సామాజిక న్యాయశాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అధికంగా తూర్పు కాపు, గాజుల కాపు సామాజికవర్గాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తున్నా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఆ వర్గాలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని తెలిపారు. కాగా, కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రధాని మోదీ నాయత్వంలో సామాజిక న్యాయశాఖకు నిధుల కేటాయింపులో పెద్దపీట వేయడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు.
Updated Date - 2020-03-14T10:47:03+05:30 IST