ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ నిర్ణయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది: మోపిదేవి

ABN, First Publish Date - 2020-11-03T22:25:32+05:30

బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ‘జయహో జగనన్న’ బీసీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ‘జయహో జగనన్న’ బీసీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి మాట్లాడారు. ‘పాదయాత్రలో ప్రజలు స్థితిగతులను జగన్ కళ్లారా చూశారు. రాజకీయ ఆరంగ్రేటం నుంచి సీఎం అయ్యేంత వరకూ ఓ చరిత్ర. బీసీ సామాజిక వర్గాలు ఇప్పటి వరకూ ఓటు బ్యాంక్‌గానే ఉన్నాయి. బీసీలకు పదవులు అంటే మూడు నాలుగు కులలాకే అందేవి. ఇప్పుడు అన్ని కులాలకు జగన్ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు. సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు వచ్చిన పదవులు విజిటింగ్ కార్డులకే పరిమితం కాకూడదు. జగన్ ఆశయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వెనకబడిన కులాల్లో అభివృద్ధి చెందేలా కార్పొరేషన్లు పని చేయాలి’ అని మోపిదేవి ఆకాంక్షించారు.

Updated Date - 2020-11-03T22:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising