వైసీపీ ఎంపీలలో ఇద్దరికి కరోనా పాజిటివ్
ABN, First Publish Date - 2020-09-14T17:20:04+05:30
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వెళ్లిన వైసీపీ ఎంపీలలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వెళ్లిన వైసీపీ ఎంపీలలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. పార్లమెంట్ దగ్గర నిర్వహించిన టెస్టుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. ఈ ఇద్దరు ఎంపీలు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. హోటల్ రూమ్‌లకే పరిమితం అయిపోయారు. సమావేశాలకు హాజరు కావడం లేదని తెలిపిన ఎంపీలు.. తమను కలవడానికి ఎవరూ రావొద్దని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యక్తిగత సిబ్బందికి సూచించారు.
Updated Date - 2020-09-14T17:20:04+05:30 IST