ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతల అరాచకం.. న్యాయం కోసం దళిత యువతి పోరాటం

ABN, First Publish Date - 2020-09-20T04:24:12+05:30

మహిళలపై వైసీపీ నేతల వేధింపులు అన్నిచోట్లా బయటపడుతున్నాయి. చిన్న ఉద్యోగులను లక్ష్యంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: మహిళలపై వైసీపీ నేతల వేధింపులు అన్నిచోట్లా బయటపడుతున్నాయి. చిన్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లైంగింక వేధింపులకు దిగుతున్నారు. కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ఏఎన్‌ఎమ్‌ను వైసీపీ నేత వేధిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


పెనమలూరు నియోజకవర్గం చోడవరంలో ఏఎన్‌ఎమ్‌ను కాకర్ల వెంకటరత్నం అనే వైసీపీ మాజీ సర్పంచ్ వేధించడం ప్రారంభించారు. వెంకటరత్నంతో పాటు మరో ఇద్దరు కూడా వేధింపులు మొదలు పెట్టారు. వీరి ఆగడాలను భరించలేక అధికారిణికి ఫిర్యాదు చేసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆ ఉద్యోగిని ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తీసుకువెళ్లింది. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆమెను కానూరుకు బదిలీ చేశారు. 


బాధితురాలైన ఏన్ఎమ్ కోవిడ్ సమయంలో ఉత్తమ సేవలందించారు. అవార్డు కూడా పొందారు. గ్రామస్థులు కూడా చోడవరం గ్రామానికి ఆమె ఏఎన్ఎమ్‌గా ఉండాలని అధికారులకు లేఖ కూడా రాశారు. చేసిందంతా చేసి సర్దుకపోలంటున్నారని బాధిత ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేస్తోంది. జగన్ తనకు ఉద్యోగం ఇచ్చారని, ఇప్పుడు కూడా ఆయనే తనకు న్యాయం చేయాలని వైసీపీ నేతల వేధింపులకు ముగింపు పలికేలా చూడాలని ఆమె వేడుకుంటోంది. 


Updated Date - 2020-09-20T04:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising