ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం సొంత ఇలాకాలో భూదౌర్జన్యం!

ABN, First Publish Date - 2020-08-12T00:07:26+05:30

ముఖ్యమంత్రి ఇలాకాలో రెవెన్యూ అధికారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటిదాకా అధికార పార్టీ నేతలపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ముఖ్యమంత్రి ఇలాకాలో రెవెన్యూ అధికారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటిదాకా అధికార పార్టీ నేతలపై మాత్రమే కబ్జా ఆరోపణలు వచ్చాయి. కానీ కడప జిల్లాలో మాత్రం రెవెన్యూ అధికారులు కూడా ఇదే లిస్టులో చేరిపోయారు. 


రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి స్థల సేకరణ సీఎం సొంత ఇలాకాలో ఇంకా కొనసాగుతూనే ఉంది. కడప నగర శివారులోనూ, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న డీకేటీ భూములు, కొన్ని పట్టా భూములను సైతం రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటూ యంత్రాలతో చదును చేస్తున్నారు. ఏమిటీ దౌర్జన్యం అని ప్రశ్నించిన రైతులకు ఈ భూములు చుక్కల భూములని.. మరికొన్ని పీవోటీ భూములని అప్పట్లో ప్రభుత్వానికి అవసరం లేక పట్టించుకోకపోవడంతో సాగు చేశారని.. ఇప్పుడు ఈ భూములు ప్రభుత్వానికి అవసరముందని.. పేదవారి ఇంటి స్థలాలకు కావాలని రెవెన్యూ అధికారులు తెగేసి చెబుతున్నారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిందని, న్యాయపరంగా అంతా సాఫీగా జరిగితే ఆగస్టు 15న పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ఏపీ సీఎం జగన్ అనడంతో సీఎం సొంత ఇలాకా కడప జిల్లాలో రెవెన్యూ అధికారులు  స్థలాలను, భూములను దౌర్జన్యంగా లాక్కోవడంలో వేగం పెంచారు. 

Updated Date - 2020-08-12T00:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising