విద్యుత్ లైన్ మెన్‌ను చితకబాదిన వైసీపీ నేత
ABN, First Publish Date - 2020-12-29T18:06:06+05:30
విద్యుత్ బకాయిలు చెల్లించమన్నందుకు లైన్‌మెన్ ఖగేష్‌ను వైసీపీ నేత చితకబాదాడు.
గుంటూరు జిల్లా: విద్యుత్ బకాయిలు చెల్లించమన్నందుకు లైన్‌మెన్ ఖగేష్‌ను వైసీపీ నేత చితకబాదిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. గుంటూరు రూరల్ మండలం, నల్లపాడు గ్రామంలోని గేదె నాగిరెడ్డి ఆరు నెలల నుంచి విద్యుత్ బిల్లులు కట్టలేదు. దీంతో ఆ ప్రాంత లైన్ మెన్.. నాగిరెడ్డి సర్వీస్ నిలిపివేయడానికి వెళ్లగా అసభ్యకరమైన పదజాలంతో దూషించి దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన లైన్ మెన్ అక్కడే రోడ్డుపై పడిపోయాడు. లేవలేని స్థితిలో ఉన్న లైన్ మెన్‌ను 108లో ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన ఈ నెల 24వ తేదీన జరిగినా.. పోలీసులు కేసు నమోదు చేయలేదు. స్థానిక ఏఈ కిరణ్ కుమార్ ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే.. పోలీసులు తీసుకోలేదు. విద్యుత్ అధికారులు, యూనియన్ ఒత్తిడితో 26వతేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లైన్ మెన్‌కు కొందరు వైసీపీ నాయకులు ఫోన్ చేశారు. పోలీస్ కేసు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని, వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించినట్లు సమాచారం. తానిక్కడ ఉద్యోగం చేయలేనని సహచరులతో ఆవేదన వ్యక్తం చేయడంతో.. పలువురు లైన్ మెన్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగి ఐదు రోజులు అవుతున్నా.. నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని లైన్ మెన్‌లు ప్రశ్నిస్తున్నారు. నిందితుడు అధికారపార్టీ నాయకుడు కావడం.. హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గం కావడంతో విద్యుత్ ఉన్నతాధికారులు, పోలీసులు మౌనం వహిస్తున్నట్లు సమాచారం.
Updated Date - 2020-12-29T18:06:06+05:30 IST