వైసీపీ నేత యార్లగడ్డను అడ్డుకున్న పోలీసులు.. నున్నలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2020-10-05T02:14:28+05:30
రూరల్ మండలం నున్నలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న...
విజయవాడ: రూరల్ మండలం నున్నలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావును పోలీసులు అడ్డుకున్నారు. బహిరంగంగా పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. దీంతో పోలీసుల తీరుపై యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలినడకనే 2 కిలో మీట్లర్లు నడిచి వెళ్లి యార్లగడ్డ వెంకట్రావు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
Updated Date - 2020-10-05T02:14:28+05:30 IST