ప్రపంచ బ్యాంకు నిధులతో రైతు ఉత్పాదక కార్యాలయాలు
ABN, First Publish Date - 2020-02-08T10:20:38+05:30
ప్రపంచబ్యాంకు నిధులతో రాష్ట్రంలో రైతు ఉత్పాదక సంస్థ(ఎ్‌ఫపీవో)ల కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రపంచబ్యాంకు నిధులతో రాష్ట్రంలో రైతు ఉత్పాదక సంస్థ(ఎ్‌ఫపీవో)ల కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.29.44 కోట్లతో 161 మండలాల్లో 168 కార్యాలయాలను ఏపీఆర్‌ఐజీపీ పథకం కింద చేపట్టనున్నారు. 72 కేంద్రాల్లో కార్యాలయాలతో పాటు గోడౌన్లు, మిగిలిన కేంద్రాల్లో కార్యాలయాలు మాత్రమే నిర్మిస్తారు. వీటి నిర్వహణ బాద్యతలను వ్యవసాయశాఖ తీసుకోనుంది.
Updated Date - 2020-02-08T10:20:38+05:30 IST