ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట మునిగింది.. గుండె ఆగింది

ABN, First Publish Date - 2020-10-21T08:36:08+05:30

ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే వర్షాలకు తడిసి పాడైపోవడంతో తట్టుకోలేక ఓ మహిళా రైతు గుండె ఆగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంటను ఆరబెడుతూనే కుప్పకూలిన మహిళా రైతు 


జి.సిగడాం, అక్టోబరు 20: ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే వర్షాలకు తడిసి పాడైపోవడంతో తట్టుకోలేక ఓ మహిళా రైతు గుండె ఆగిపోయింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం వెలగాడకు చెందిన సూర్యనారాయణ, సుశీల(54) దంపతులు తమకున్న రెండెకరాల పొలంలో మొక్కజొన్న సాగుచేశారు. పంట చేతికందే సమయంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట పాడైపోయింది. మొలక వచ్చి ఎందుకూ పనికిరాకుండా పోయింది. దెబ్బతిన్న పంటను చూసి తట్టుకోలేక సుశీల గుండె బరువెక్కింది. తడిసిన మొక్కజొన్నలను మంగళవారం ఆరుబయట ఆరబెడుతూనే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు, స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతిచెందారు. సుశీలకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2020-10-21T08:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising