8 గంటల్లో రైల్వే బ్రిడ్జి
ABN, First Publish Date - 2020-05-09T09:43:22+05:30
అది శిథిలావస్థకు చేరుకున్న రైల్వే బ్రిడ్జి. విజయవాడ డివిజన్‌లోని ఒంగోలు-కరావాండి డౌన్‌లౌన్ (చెన్నై-విశాఖపట్నం వయా విజయవాడ మార్గం)లో ఉంది.
విజయవాడ, మే 8 (ఆంధ్రజ్యోతి): అది శిథిలావస్థకు చేరుకున్న రైల్వే బ్రిడ్జి. విజయవాడ డివిజన్‌లోని ఒంగోలు-కరావాండి డౌన్‌లౌన్ (చెన్నై-విశాఖపట్నం వయా విజయవాడ మార్గం)లో ఉంది. దీన్ని పడగొట్టి పునర్నిర్మించాలంటే రోజుల సమయం పడుతుంది. కానీ.. విజయవాడ రైల్వే డివిజన్ దాన్ని 8 గంటల రికార్డు సమయంలోనే పునర్నిర్మించి శభాష్ అనిపించింది. గురువారం రాత్రి 7.30 గంటలకు ఈ బ్రిడ్జి పనులు ప్రారంభించి శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకల్లా దాన్ని పూర్తిచేశారు.
శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిని తొలగించి ప్రీకాస్ట్ టెక్నాలజీ విధానంలో ఆర్‌సీసీ బ్లాక్‌లను ఉపయోగించి నిర్మాణం పూర్తి చేశారు. లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో దీనికోసం 20 మంది కార్మికులనే వినియోగించారు. యంత్ర సామగ్రిని మాత్రం భారీగానే వాడి 8 గంటల రికార్డు సమయంలోనే దీన్ని పూర్తిచేసిన విజయవాడ డివిజన్.. భారతీయ రైల్వే అభినందనలు చూరగొంది.
Updated Date - 2020-05-09T09:43:22+05:30 IST