ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య, భర్త.. ఓ ప్రియురాలు

ABN, First Publish Date - 2020-02-11T08:33:38+05:30

వివాహేతర సంబం ధం పచ్చని కుటుంబంలో చిచ్చురేపి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహేతర బంధం మిగిల్చిన విషాదం

అద్దంకి, ఫిబ్రవరి 10: వివాహేతర సంబం ధం పచ్చని కుటుంబంలో చిచ్చురేపి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. గుండ్లకమ్మలోకి దూకిన ప్రియురాలిని రక్షించే ప్రయత్నంలో ప్రియుడు మృతి చెందాడు. ఈ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం గురించి తెలిసి అతని భార్య పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.  పంగులూరు మండలం చందలూరుకు చెందిన గుంజి వేణు(45), ధనలక్ష్మి దంపతులు పదేళ్లుగా అద్దంకిలో నివాసం ఉంటున్నారు. వేణు ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌ బేల్దారి పనులకు వెళ్లినప్పుడు అ క్కడ అద్దంకి మండలం నాగులపాడుకు చెందిన మల్లేశ్వరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత వేణు హైదరాబాద్‌ నుంచి వచ్చేసినా ఈ సంబంధం కొనసాగుతూనే ఉం ది. మల్లేశ్వరి 3 రోజుల క్రితం అద్దంకి వచ్చి వే ణును కలిసి వెళ్లింది. ఆ విషయం ధనలక్ష్మికి తెలియడంతో కలహం మొ దలైంది. ఈ నేపథ్యంలో సోమవారం మల్లేశ్వరి కోసం వేణు నాయుడుపాలెం వెళ్లా డు. విషయం తెలుసుకున్న భార్య ధనలక్ష్మి పురుగుమందు తాగింది. స్థానికులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం త ప్పింది. బంధువులు వేణుకు ఫోన్‌చేసి విషయం చెప్పా రు. అతను మళ్లీశ్వరిని బైక్‌పై ఎక్కించుకొని అద్దంకి బయల్దేరాడు. గుండ్లకమ్మ బ్రిడ్జి వద్దకు వచ్చిన తర్వాత ఇద్దరూ గొడవపడినట్టు తెలుస్తోంది. దీంతో మల్లేశ్వరి బ్రిడ్జిపై నుంచి గుండ్లకమ్మలోకి దూకింది. ఆమె కోసం వేణు కూడా దూకాడు. అటుగా వెళ్తున్న వ్యక్తి నది ఒడ్డు నుంచి తాడు విసిరాడు. మల్లేశ్వరి ఒడ్డుకు చేరుకోగా.. వేణు నదిలో పడి చనిపోయాడు.

Updated Date - 2020-02-11T08:33:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising