ఆర్‌టీపీపీ విక్రయంపై గోప్యమెందుకు?
ABN, First Publish Date - 2020-05-09T09:54:02+05:30
ఏపీ జెన్‌కో కింద ఉన్న రాయలసీమ థర్మల్ విద్యుత్కేంద్రం (ఆర్‌టీపీపీ) విక్రయ ప్రతిపాదన విషయంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి సవ్యంగా లేదని విద్యుత్ ..
ఇంధన కార్యదర్శికి విద్యుత్ జేఏసీ లేఖ
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ఏపీ జెన్‌కో కింద ఉన్న రాయలసీమ థర్మల్ విద్యుత్కేంద్రం (ఆర్‌టీపీపీ) విక్రయ ప్రతిపాదన విషయంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి సవ్యంగా లేదని విద్యుత్ ఇంజనీర్ల సంఘాల జేఏసీ ధ్వజమెత్తింది. తమతో ముందుగా సంప్రదిస్తామన్న హామీని తుంగలో తొక్కి గోప్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది.
ఇదే వైఖరితో యాజమాన్యం వ్యవహరిస్తే తాము ఆందోళనకు దిగక తప్పదని, దీనివల్ల అశాంతి ఏర్పడితే దానికి యాజమాన్యానిదే బాధ్యత అవుతుందని శుక్రవారం ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌కు రాసిన లేఖలో హెచ్చరించింది. దీని అమ్మకంపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక అందిన తర్వాత ఇంజనీర్ల సంఘాలతో చర్చిస్తామని ఆయన హామీ ఇవ్వడం వల్లే ఆందోళన విరమించామని గుర్తుచేసింది. కానీ నిపుణుల కమిటీ నివేదిక వచ్చినా ఇంతవరకూ తమను సంప్రదించలేదని జేఏసీ ఆక్షేపించింది.
Updated Date - 2020-05-09T09:54:02+05:30 IST