ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ను మంత్రి వెల్లంపల్లి ఎందుకు ప్రాధేయపడ్దారు?

ABN, First Publish Date - 2020-09-13T21:40:09+05:30

ఎంత ఎత్తుకు ఎదిగినా.. గతాన్ని మరువకూడదన్నది పెద్దలు చెప్పేమాట. అయితే ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న ఆ నేత.. ఆ విషయం కాస్తా మరిచి మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఎంత ఎత్తుకు ఎదిగినా.. గతాన్ని మరువకూడదన్నది పెద్దలు చెప్పేమాట. అయితే ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న ఆ నేత.. ఆ విషయం కాస్తా మరిచి మాట్లాడారు. ఒకప్పుడు తన గెలుపునకు ప్రచారం చేయాలంటూ ప్రాధేయపడిన నాయకుడిపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే అవి ఆ అమాత్యుడికే బూమరాంగ్ అయ్యాయి. ఇంతకీ ఎవరా మంత్రి? ఆయన ఎవరిపై, ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? అవి ఆయనకే ఎందుకు రివర్స్ అయ్యాయి?


ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో ఉన్నది ఎవరో కాదు.. వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి. 2014లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా వెల్లంపల్లి పోటీ చేశారు. ఆ సమయంలో అక్కడ ప్రచారానికి వెళ్లిన జనసేనాని పవన్‌కల్యాణ్‌ని వెల్లంపల్లి శ్రీనివాస్ కలిశారు. తనకు మద్దతుగా ఒక మాట మాట్లాడాలని ఆయన్ను బతిమాలాడుకున్నారు. నాడు టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచిన పవన్‌కల్యాణ్.. వెల్లంపల్లిని మనస్ఫూర్తిగా గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.


అయితే అప్పటి సంగతి.. ఇప్పుడు ఎందుకు అనేగా మీ సందేహం. ఈ విషయం తెలియాలంటే.. ఇటీవల చోటుచేసుకున్న అంతర్వేది ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి తెలుసుకోవాలి. అంతర్వేది రథం దగ్దమైన ఘటనలో జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అంతర్వేది ఘటనపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదని ఆయన ధ్వజమెత్తారు. సినిమాల్లో రోజుకో వేషం వేసినట్లు.. రాజకీయాల్లో పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు తన పిల్లలు క్రిస్టియన్ అని చెప్పిన పవన్.. ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షకుడుగా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.



పవన్‌కల్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేల్చడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోయారు. ఆయనకు దిమ్మతిరిగేలా చేయాలని.. తమ దగ్గరున్న ఈ పాత వీడియోని బయటకు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు పవన్‌కల్యాణ్‌ మద్దతు కోసం "బాబ్బాబు..." అంటూ ప్రాధేయపడిన వెల్లంపల్లి.. తన గతాన్ని మరిచి మాట్లాడటం సరికాదని హేళన చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో వెల్లంపల్లిని బూతంలా వెంటాడుతోందట. పవన్‌పై మంత్రి వెల్లంపల్లి చేసిన చేసిన కామెంట్లు... ఆయనకే బూమరాంగ్ అయ్యాయని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Updated Date - 2020-09-13T21:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising