ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్షన్‌ పెంపుదల ఏదీ?

ABN, First Publish Date - 2020-08-02T09:00:04+05:30

అవ్వాతాతల కు ఇస్తున్న పెన్షన్‌ను ఈ నెల కూడా ప్రభుత్వం పెం చలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జూలైలోనే మరో 250లు పెంచాల్సి ఉన్నా 
  • ఈ నెలా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం 
  • ఎదురుచూసి నిరాశ చెందిన అవ్వాతాతలు 

అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): అవ్వాతాతల కు ఇస్తున్న పెన్షన్‌ను ఈ నెల కూడా ప్రభుత్వం పెం చలేదు. టీడీపీ ప్రభుత్వం ఇస్తున్న రూ.1000 పెన్షన్‌ను రెట్టింపు చేయడంతోపాటు ఏటా రూ.250 చొప్పన పెం చి ఇస్తామని వైసీపీ మొదట్లో ప్రకటించింది. ఈ క్ర మంలోనే గత ఏడాది జూలైలో రూ.250లు పెంచి ప్ర తి నెలా రూ.2250 చొప్పున ఇస్తోంది. ఇలా ఏడాది పూ ర్తి కావడంతో ఈ జూలైలో మరో రూ.250 పెంచి ఇ స్తారని వృద్ధులు ఆశించారు.


కానీ యథాతథంగానే ఇవ్వడంతో ఆగస్టులోనైనా పెంచి ఇస్తారేమోనని శనివారం పెన్షన్‌దారులు ఎదురుచూశారు. అ యితే వారికి నిరాశే ఎదురైంది. పెంచిన పెన్షన్‌ను ఎప్పుడిస్తారని వలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను అడిగినా సమాధానం లేదు. ప్రభుత్వంలో కూడా సామాజిక పెన్షన్ల పెంపుదలపై చర్చ జరిగినట్లు సమాచారం లేదు.  


కరోనా సాయం ఏదీ?

కేంద్ర ప్రభుత్వం కరోనా ఉపశమనం కింద దేశవ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతు పెన్షన్‌దారులకు ఒక్కొక్కరికీ రూ.వెయ్యి మంజూరు చేసింది. ఒక్కో దఫా రూ.500 చొప్పున రెండుసార్లు విడుదల చేయ గా.. ఆ నిధులు రాష్ట్ర ఖజానాలో జమయ్యాయి. అయి తే రాష్ట్రంలో ఈ పరిహారం పెన్షన్‌దారులకు అందించలేదు. రాష్ట్రంలో 27,09,473 మంది వృద్ధాప్య, 20,77,022 మంది వితంతువు, 6,28,480 మంది దివ్యాంగులు పెన్షన్లు పొందుతున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ప్రయోజనం కల్పించాల్సి ఉం ది. అయితే ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదు. 

Updated Date - 2020-08-02T09:00:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising