ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజాన్ని నడిపించడంలో మహిళలదే అగ్రస్థానం

ABN, First Publish Date - 2020-03-16T11:40:15+05:30

సమాజాన్ని నడిపించడంలో మహిళలే అగ్రస్థానంలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ డైరెక్టర్‌ శ్రీశ్రీ కళావేదిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా జాతీయ విశిష్ట ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం


ఏలూరు కల్చరల్‌, మార్చి 15 : సమాజాన్ని నడిపించడంలో మహిళలే అగ్రస్థానంలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ డైరెక్టర్‌ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్‌, రాష్ట్ర సాహిత్య అకాడమీ సభ్యుడు కత్తిమండ ప్రతాప్‌ అన్నారు. ఏలూరు వైఎంహెచ్‌ఏ ప్రాంగణంలో ఆదివారం వేదిక సీసీ టీవీ, ఆదరణాలయ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ విశిష్ట ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్శిటీ ప్రొఫెసర్‌ డి.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక సేవా రంగంలో కృషి చేస్తున్న వివిధ రాష్ట్రాల ప్రతిభావంతులను గుర్తించి అవార్డులు అందించడం అభినందనీయమన్నారు.


అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వర్తమాన ప్రతిభావంతులు, సామాజిక అసమానతలు పారద్రోలడంలో ముందంజలో ఉండాలన్నారు. వేదిక కన్వీనర్‌ డాక్టర్‌ ఆరవల్లి నరేంద్ర మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రతిభావంతులను గుర్తించి అవార్డులు అందిస్తున్నామన్నారు. అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన 42 మందికి జాతీయ విశిష్ట సేవా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో తరపట్ల, బోళ్ళసతీష్‌బాబు, కార్తిక్‌రెడ్డి, కె సురేష్‌కుమార్‌, సీహెచ్‌ఎన్‌ కుమార్‌, రాజేశ్వరి, ఎం.సౌజన్య పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T11:40:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising