ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు నిల్‌.. రాత్రయితే ఫుల్‌!

ABN, First Publish Date - 2020-12-08T04:09:44+05:30

జిల్లాలోని మద్యం దుకాణాల రూటే సెప రేటు.. ప్రభుత్వం ఒకటి చెబితే అధికారులు మరొకటి చేస్తున్నారు. ఆరంభం నుంచి నడుస్తోంది ఇదే. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. నిర్ణీత సమయానికి మించి అమ్మకాలు సాగిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి సొమ్ము వసూలు చేస్తున్నా సంబంధిత అధికారులు చూసీ చూడ నట్టు వ్యవహరిస్తున్నారు.

కొవ్వూరులో రాత్రి 9 గంటల సమయంలో మద్యం విక్రయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమయం దాటినా మద్యం విక్రయాలు

అధిక ధరలకు అమ్మకాలు 

పట్టించుకోని అధికారులు

మోసపోతున్న మందుబాబు

నిడదవోలు, డిసెంబరు 7 : జిల్లాలోని మద్యం దుకాణాల రూటే సెప రేటు.. ప్రభుత్వం ఒకటి చెబితే అధికారులు మరొకటి చేస్తున్నారు. ఆరంభం నుంచి నడుస్తోంది ఇదే. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. నిర్ణీత సమయానికి మించి అమ్మకాలు సాగిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి సొమ్ము వసూలు చేస్తున్నా సంబంధిత అధికారులు చూసీ చూడ నట్టు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులు నోరు  మెదపడం లేదు.. 


నిబంధనలు మీరి అమ్మకాలు..

నిబంధనల ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు విక్రయించాలి.ఆ తరువాత 8 నుంచి 9 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేసి ఆ రోజు జరిగిన లావాదేవీలకు సం బంధించిన లెక్కలు చూసుకోవాలి. అయితే సిబ్బంది మాత్రం ఆ గంటనూ సద్వినియోగం చేసుకుంటున్నారు.. అదనంగా సంపాదిస్తున్నారు.. మందు బాబుల జేబులు కొల్లగొడుతున్నారు. అదెలాగంటే రాత్రి 8 గంటల తరు వాత  కూడా అధిక ధరలకు విక్ర యాలు సాగిస్తున్నారు.మద్యం విలువ ఆధారంగా రూ.30ల వరకూ అదన ంగా వసూలు చేస్తున్నారు. జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూ డెం, యర్నగూడెం, పోలవరం, తాళ్ళ పూడి, పెనుగొండ, తణుకు ఇలా ఏ ప్రాంతంలో చూసినా ఒకటే కఽథ. అం దిన కాడికి మందుబాబులను దోచు కుంటున్నారు.ఒకవేళ ఎవరైనా దీనిపై ఫిర్యాదు చేద్దామని ఫోను చేసినా సంబంధిత అధికారులు స్పందించడం లేదన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. 


నిబంధనలు మీరవద్దు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి 8 గంటల తరువాత మద్యం విక్రయించడం, అధిక ధరలు వసూలు చేయడం నేరం. ఇప్పటి వరకూ మా దృష్టికి రాలేదు. ఎక్కడైనా జరిగితే తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

మోహనరావు, చాగల్లు  డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌


Updated Date - 2020-12-08T04:09:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising