బయటపడ్డ భార్య బండారం.. పుట్టింటికి వెళ్లిపొమ్మని భర్త చెప్తే.. ఆమె చేసిన ఘోరమిదీ..!
ABN, First Publish Date - 2020-05-09T20:20:55+05:30
భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటనలో భార్యను, ఆమె ప్రియుడ్ని ఏలూరు త్రీటౌన్ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్ మూర్తి అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన గురిపాటి నాగరాజు (30)కు ఏడేళ్ల క్రితం భూలక్ష్మి (23)తో వివాహం అయింది
భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్
ఏలూరు(ఆంధ్రజ్యోతి): భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటనలో భార్యను, ఆమె ప్రియుడ్ని ఏలూరు త్రీటౌన్ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్ మూర్తి అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన గురిపాటి నాగరాజు (30)కు ఏడేళ్ల క్రితం భూలక్ష్మి (23)తో వివాహం అయింది. నాలుగేళ్ల క్రితం వీరిద్దరు ఏలూరు సమీపంలోని వట్లూరు రాఘవ ఎస్టేట్ సీతా కాలనీలో ఉంటూ తాపీ పనులు చేస్తున్నారు. వట్లూరులోని ప్రగతి పౌల్ర్టీ కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన తోకల సురేశ్‌బాబు అలియాస్ సురేశ్ (40) కూడా తాపీ పనులకు వచ్చేవాడు. ఈక్రమంలో భూలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై భర్త ఆమెను మందలించి ఆమె పుట్టిల్లు అయిన గుంటూరు వెళ్లిపోవాలని చెప్పాడు. దీనిపై తరచూ గొడవ పడేవారు.
దీంతో భూలక్ష్మి భర్తను అడ్డుతొలగించుకోవాలని సురేశ్‌తో పథకం పన్నింది. ఈనెల 6వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు నాగరాజు ఇంట్లోనే అతనితో కలసి సురేశ్ మద్యం తాగాడు. రాత్రి 8.30 గంటల సమయంలో భూలక్ష్మి, సురేశ్ కలిసి నాగరాజు మెడకు టవల్ చుట్టి హతమార్చారు. నాగరాజుపై కోపం తగ్గక భూలక్ష్మి ఇనుపరాడ్డుతో అతని తలను పగులగొట్టింది. 7వ తేదీ ఉదయం ఇంటి వద్ద ఉన్న రక్తపు మరకలను తుడుస్తుండగా ఆ ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ గార్డ్ కొత్తూరు వెంకరత్నం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈలోపే తన భర్త ఉరేసుకుని మరణించాడంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పింది. ఈ ఘటనపై త్రీటౌన్ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితులైన భూలక్ష్మి, ఆమె ప్రియుడు సురేశ్‌ను అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయడంతో త్రీటౌన్ ఎస్‌ఐలు ఎం.వెంకట రమణ, బీఎస్‌డీఆర్ ప్రసాద్ సహకరించారు.
Updated Date - 2020-05-09T20:20:55+05:30 IST