హరోం హర...
ABN, First Publish Date - 2020-12-15T05:38:31+05:30
పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారంతో పాటు అమావాస్య కూడా తోడుకావడంతో భక్తు లు శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలు, బిల్వార్చనలు నిర్వహించారు.
ఆలయాల్లో అభిషేకాలు, బిల్వార్చనలు
ఏలూరు కల్చరల్/ఏలూరు కార్పొరేషన్ డిసెంబరు 14 : పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారంతో పాటు అమావాస్య కూడా తోడుకావడంతో భక్తు లు శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలు, బిల్వార్చనలు నిర్వహించారు. ఉద యం మహిళలు కార్తీక దీప పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో కాల్వల్లో స్నానమాచరించి దీపాలు వెలిగించారు. శనివారపు పేట చెన్న కేశవస్వామి ఆలయంలో ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో, దొండ పాడు బాల అయ్యప్ప క్షేత్రం, పోణంగిలోని పురాతన వైనతేయేశ్వరస్వామి, మాదేపల్లిలోని శివాలయంలో ఉదయం పంచామృతాభిషేకాలు, తేనె, పంచ దార, గోక్షీరం, వివిధ పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆకాశ దీప పూజ, హారతి సేవ లు నిర్వహించారు. పలు ఆలయాల్లో శాంతి కల్యాణం నిర్వహించారు. భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు. నగరంలోని పత్తేబాద చౌడేశ్వరి రామ లింగేశ్వర స్వామి ఆలయంలో, రామచంద్రరావుపేటలోని శివకేశవ ఆలయం వద్ద, దక్షిణపువీధిలోని మార్కండేయ స్వామి, జరా పరహరేశ్వర స్వామి, అగ్రహారంలోని నగరేశ్వరస్వామి, పాత శివాలయం, పవరుపేట లోని కాశీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి, ఆదివారపుపేట, మంచినీళ్ళతో ట, బావిశెట్టివారిపేటలలోని శివాలయాల వద్ద, సత్యనారాయణ పేటలోని పార్వతీ సమేత రేవు లింగేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు అభిషేకాలు, అర్చనలు, హోమాలతో ఆరాధించారు. దత్తాశ్రమంలో ఏకాదశ రుద్రపురస్పర శ్రీ రుద్రకల్పం నిర్వహించారు. సత్రంపాడులోని సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద అమావాస్య సందర్భంగా లక్ష బిల్వార్చన, లక్ష దీపోత్సవ మహా రుద్రాభిషేకం నిర్వహించారు.
Updated Date - 2020-12-15T05:38:31+05:30 IST