ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నమ్మకాన్ని నిలుపుకున్నాం : మంత్రులు

ABN, First Publish Date - 2020-12-30T05:43:09+05:30

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మ కాన్ని నిలబెట్టుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పేర్ని నాని అన్నారు.

లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని, జేసీ వెంకటరమణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, డిసెంబరు 29 : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మ కాన్ని నిలబెట్టుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం ఏలూరు రూరల్‌ మం డలం లక్ష్మీనగర్‌లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడాదిన్నర పాలనలోనే సీఎం జగన్‌ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలను ఇచ్చి ప్రజలపై తమ అభిమానాన్ని చాటుకున్నారన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరు పేద ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన వాగ్ధానాల ను అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. చంద్రబాబు వల్ల పట్టాల పంపిణీ ఆలస్యమైందని విమర్శించారు. జేసీ వెంకట రమణారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఉదయభాస్కర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, ఏఎంసీ ఛైర్మన్‌ మైబాబు, ఎంపీడీవో జీఆర్‌ మనోజ్‌, పలువురు అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T05:43:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising