ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ గోదావరిలో 2762కు చేరుకున్న కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-07-14T13:32:28+05:30

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే 170 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2762కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే ఏలూరులో 85 కేసులు నమోదయ్యాయి. దీంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. జిల్లాలో కొత్తగా ఆరు కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఏలూరు ఆశ్రం కాలేజ్‌లో కోవిడ్ పరీక్షల కేంద్రం విస్తరిస్తున్నామని.. ఇకపై ప్రతీరోజు 2వేల పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి మీడియాకు వివరించారు.


ఇదిలా ఉంటే.. జిల్లాలోని తణుకు మున్సిపాలిటి పరిధిలోని 21వ వార్డులో ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్ అని మంగళవారం నాడు నిర్దారణ అయింది. ఆ ఇద్దర్ని తాడేపల్లిగూడెంకు చెందిన కోవిడ్ సెంటర్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆ ఇద్దరితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని వెతికే పనిలో అధికారులు, పోలీసులు నిమగ్నమయ్యారు.

Updated Date - 2020-07-14T13:32:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising