ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛమైన తాగునీరు సరఫరాలో విఫలం

ABN, First Publish Date - 2020-12-11T05:32:12+05:30

నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించడంలో మునిసిపల్‌ అధికారులు విఫలమయ్యారని భార తీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు కురెళ్ళ సుధాకర కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు ధర్నా

ఏలూరు టూ టౌన్‌, డిసెంబరు 10: నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించడంలో మునిసిపల్‌ అధికారులు విఫలమయ్యారని భార తీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు కురెళ్ళ సుధాకర కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గురువారం బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ నగర ప్రజలు అనారోగ్యాల పాలవ్వడానికి నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందే కారణమని ఆరోపించారు. తాగునీటి కాలుష్యం పరి ష్కరమయ్యే వరకు నగర ప్రజలకు మినరల్‌ వాటర్‌ ఉచితంగా అందజే యాలన్నారు. కృష్ణాకెనాల్‌లో వచ్చే దుర్గంధాన్ని అరికట్టాలన్నారు. నగరం లో ఉన్న 26 ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకులను పరి శుభ్రపర్చాలన్నారు. డంపింగ్‌ యార్డులో చెత్తను తగలబెట్టకుండా సహజ సిద్ధ ఎరువుగా మార్చే ప్ర క్రియ చేపట్టాలన్నారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే వరకు, పారిశుధ్యాన్ని మెరుగుపరిచే వరకూ బీజేపీ పోరాడు తుందన్నారు. కార్యక్రమంలో శీర్ల భాస్కర్‌, బాడిద నారాయణ, దిడ్ల ఆంజిలో, నాగం శివ, వెంకటేశ్వరరావు, పసుపులేటి మనోహర్‌ ప్రసాద్‌, నుదురుపాటి కృష్ణ చైతన్య శర్మ, ఉలవల సాయి, తదితరులు పాల్గొ న్నారు. 

Updated Date - 2020-12-11T05:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising