ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహేతర సంబంధం తెలిసిందని చంపేశాడు!

ABN, First Publish Date - 2020-12-21T04:20:57+05:30

ఏపీ నిట్‌లో హత్య కేసును పోలీసులు ఛేదించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపి నిట్‌ హత్య కేసులో నిందితుడి అరెస్టు

తాడేపల్లిగూడెం క్రైం, డిసెం బరు 20 : ఏపీ నిట్‌లో హత్య కేసును పోలీసులు ఛేదించారు. పట్టణ సీఐ ఆకుల రఘు తెలిపిన వివరాల ప్రకారం. బిహార్‌ రాష్ట్రం గన్టీ గ్రామానికి చెందన షాహిద్‌ ఆలిఖాన్‌తో పాటు మరి కొంత మంది ఏపీ నిట్‌లో పని చేసేందుకు వేరే కంపెనీ ద్వారా వచ్చారు. అయితే షాహిద్‌ ఆలిఖాన్‌ బంధువుతో ఫర్వేజ్‌ ఖాన్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న విషయం షాహిద్‌ ఆలిఖాన్‌కు తెలిసింది. దీంతో అతన్ని హతమారిస్తే కానీ తన వివాహేతర సంబంధం కొనసాగదని భావించాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఫర్వేజ్‌ ఖాన్‌కు ఈ నెల 11వ తేదీ రాత్రి షాహిద్‌ ఆలిఖాన్‌ పనిచేసే ప్రాంగణంలో ఒంటరిగా కనిపించాడు. దీంతో అతను ఒక రాడ్డుతో తలపై బలంగా కొట్టి పై ఫ్లోరు నుంచి కిందకు పడేసి ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే పోలిసులు రంగ ప్రవేశం చేసి ఫర్వేజ్‌ ఖాన్‌ను అదుపులోకి తీసు కుని విచారించగా హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్టు సీఐ ఆకుల రఘు వివరించారు. 

Updated Date - 2020-12-21T04:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising