గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలి : డీజీపీ
ABN, First Publish Date - 2020-12-16T04:23:09+05:30
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ ఇచ్చిన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ కెవి మోహనరావు స్పష్టం చేశారు.
ఏలూరు క్రైం, డిసెంబరు 15 : గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ ఇచ్చిన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ కెవి మోహనరావు స్పష్టం చేశారు.నేషనల్ వైడ్ యాంటీ డ్రగ్స్ వారోత్స వాలను పురస్కరించుకుని డీజీపీ గౌతం సవాంగ్ అన్ని జిల్లాల ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర దేశంలోని ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా జరు గుతుం దన్నారు.ఈ మేరకు నిఘా పెంచాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో ఏలూరు రేంజ్ డీఐజీ కెవి మోహనరావు, జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సి.జయరామరాజు హాజరయ్యారు. అనంతరం ఏలూరు రేంజ్ కార్యాలయం నుంచి డీఐజీ కెవీ మోహనరావు పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ సంబంధిత అధికారులతో మంగళవారం రాత్రి వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఎస్సీ,ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు.
Updated Date - 2020-12-16T04:23:09+05:30 IST