మంచినీరివ్వండి మహాప్రభో..!
ABN, First Publish Date - 2020-11-04T05:00:29+05:30
నగర పంచాయతీ అయినా తీరుమారలేదు. పట్టణంలోని కొన్ని వార్డులలో నేటికి కుళాయి నీరు సరఫరా కావడంలేదు.
ఆకివీడు, నవంబరు 3: నగర పంచాయతీ అయినా తీరుమారలేదు. పట్టణంలోని కొన్ని వార్డులలో నేటికి కుళాయి నీరు సరఫరా కావడంలేదు. వేలాది రూపాయల ఫీజుతో కుళాయి వేశారు. తాగునీరు సరఫరా చేయడం లేదు. కానీ కుళాయి పన్ను చెల్లించాల్సిందే. స్థానిక ముస్లిం వీధిలో సుమారు మూడేళ్ల నుంచి కుళాయి నీరు లేదని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఫలితంలేదని స్థానికులు వాపోతున్నారు. రోజు విడిచి రోజు ట్యాంకరు ద్వారా నీరు సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులూ పట్టించుకోరా..
వృద్ధాప్యంలో ట్యాంకరు నీరు పట్టుకోలేని పరిస్థితి. కుళాయి నీరు రాకపోతే బయట కొనుగోలు చేసుకుంటు న్నాం. సుమారు మూడేళ్ల నుంచి తాగునీరు సరఫరా కావడంలేదు. ఉన్నతధికారులు కూడా పట్టించుకోలేదు.
పువ్వాడ సర్వలక్ష్మి, ఆకివీడు
Updated Date - 2020-11-04T05:00:29+05:30 IST