ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమష్టిగా దేశాన్ని కాపాడుకుందాం

ABN, First Publish Date - 2020-10-23T11:31:42+05:30

కార్పొరేట్‌ల కోసం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మనదేశాన్ని, కార్మిక వర్గాన్ని కాపా డుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కార్పొరేషన్‌, అక్టోబరు 22 : కార్పొరేట్‌ల కోసం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మనదేశాన్ని, కార్మిక వర్గాన్ని కాపా డుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. సీఐటీయూ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశానికి బి.సోమయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిఽథిగా హాజరైన ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత ఆరున్నరేళ్లుగా బీజేపీ స్వదేశీ పేరుతో కార్పొరేట్లకు అనుగుణంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా విధానాలు అవలంభించడం తగదన్నారు.


కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడానికి బదులుగా కార్పొరేట్లకు అనుగుణంగా వ్యవహరించా రన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోందన్నారు. కార్యక్రమంలో సీఐటీయు నాయకులు చింతకాయల బాబూ రావు, డి.ఎన్‌.వి.డి.ప్రసాద్‌, ఆర్‌.లింగరాజు, కర్రి నాగేశ్వరరావు, కె.విజయలక్ష్మి, ఎ.శ్యామలరాణి, కె.పోసమ్మ, ఎం.సుందరబాబు, కె.వెంకట్రావు, సాయి, రంగా రావు, మావూరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-23T11:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising