అలంపురంలో టేకు చెట్ల తొలగింపుపై పంచాయితీ
ABN, First Publish Date - 2020-12-12T04:29:41+05:30
టేకు చెట్ల నరికివేతపై దుమారం రేగింది. మండలంలోని అలంపురం గ్రామంలో శుక్రవారం హెల్త్‌సబ్‌సెంటర్, సచివాలయం, అంగన్‌వాడీ కేంద్రాల ప్రక్కన ఉన్న టేకు చెట్లు నరికివేశారు.
పెంటపాడు, డిసెంబరు 11 : టేకు చెట్ల నరికివేతపై దుమారం రేగింది. మండలంలోని అలంపురం గ్రామంలో శుక్రవారం హెల్త్‌సబ్‌సెంటర్, సచివాలయం, అంగన్‌వాడీ కేంద్రాల ప్రక్కన ఉన్న టేకు చెట్లు నరికివేశారు. కనీస నిబంధనలు పాటించకుండా లక్షలు విలువ చేసే చెట్లు నరికివేశారంటూ కొంతమంది గ్రామస్థులు ఆరోపించారు. అటవీశాఖ అధికారుల నుంచి చెట్ల అంచనా విలువ వచ్చిన తరువాత వేలం పాట నిర్వహించి తొలగించాలని అటువంటిదేమీ చేయకుండా చెట్లను నరికివేశారంటూ ఆరోపించారు. దీనిపై సంబందిత అధికారులను వివరణ కోరగా గ్రామంలో సచివాలయం, హెల్త్‌కేర్‌సెంటర్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కోసం చెట్లు అడ్డుగా ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని తొలగించామన్నారు. దీనిపై అటవీశాఖ అధికారులను అనుమతులు కోరామని, అటవీ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ చెట్ల విలువ అంచనా వేసేందుకు కొలతలు కూడా తీసుకుని వెళ్లారన్నారు. అటవీశాఖ నుంచి చెట్ల విలువకు సంబంధించిన అనుమతులు వచ్చిన వెంటనే చెట్లను బహిరంగవేలం వేయడం జరుగుతుందన్నారు. అంత వరకూ పంచాయతీలో చెట్ల మోదులు భద్రపరుస్తామన్నారు.
Updated Date - 2020-12-12T04:29:41+05:30 IST